కరోనా మహమ్మారి దేశాన్ని పట్టి పీడించడం మొదలు పెట్టిన తర్వాత అన్ని కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్ సదుపాయం కల్పించాయి. ఇప్పటికీ చాలా మంది వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు. అయితే దీని కారణంగా కొంత మంది డిప్రెషన్ కు గురైతే మరికొంత మంది మాత్రం బద్దకస్తుల్లా తయావుతున్నారు. అయితే వైద్యులు మాత్రం వర్క్ ఫ్రమ్ హోమ్ కారణంగా స్పైక్డ్ సిక్ స్కాపులా సిండ్రోమ్ అనే వ్యాధి వస్తుందని, ఇటీవల కాలంలో ఈ కేసులు పెరిగాయని అంటున్నారు. దాని లక్షణాలు, నివారణ చర్యలు ఏమిటో తెలుసుకుందాం.
“స్పైక్డ్ సిక్ స్కాపులా సిండ్రోమ్”ను సిక్ స్కాపులా సిండ్రోమ్, స్కాపులర్ డైస్కినిసిస్ అని కూడా పిలుస్తారు. స్కాపులా అంటే భుజం లోపల ఉన్న ఎముక. 20 నుంచి 25, 30 నుంచి 45 ఏళ్ల వయస్సు గల వారిలో ఇది ఎక్కువగా కన్పిస్తుంది. విరామం లేకుండా గంటల తరబడి కూర్చోవడం, తక్కువగా కదలడం వంటి పని చేసే వ్యక్తులలో ఇటు వంటి సమస్య వస్తూ ఉంటుంది.
Advertisements
అధిక వ్యాయామం కారణంగా ఈ కండరాల సమస్యల కేసుల సంఖ్య పెరిగిందని వైద్యులు అంటున్నారు. మనం కూర్చుని పని చేస్తున్నప్పుడు గంటల తరబడి అలాగే కూచోకుండా పొజిషన్స్ మారుస్తూ ఉండాలి. ఈ కేసులు ప్రత్యేకంగా ఐటీ ప్రొఫెషనల్స్, రిసెప్షన్, డెస్క్ వర్కర్లలో కన్పిస్తాయి. మీకు కూడా ఇలాంటి సమస్య అనిపిస్తే వ్యాయామం ద్వారా పరిష్కారం లభిస్తుంది. లేదంటే వైద్యులను సంప్రదించడం మంచిది.