సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ఎవరు చూసినా ప్రతీ చిన్న సందేశాన్ని అయినా ఫార్వర్డ్ చేయడం అలవాటుగా మారింది. అందులోనూ వాట్సప్ ను ఎక్కవగా వాడుతారు వినియోగదారులు. అయితే.. వాట్సప్ కొత్త ఐటీ రూల్స్ ను ప్రవేశపెట్టింది. 2021కి అనుగుణంగా డిసెంబర్ నెలలో భారతదేశంలో 2,079,000 ఖాతాలను నిషేధించింది.
ఈ మేరకు మంగళవారం ఓ ప్రకటన విడుదల చేసింది తెలిపింది వాట్సాప్. డిసెంబర్ నెలలో 528 ఫిర్యాదులు అందినట్లు ప్రకటించింది. వాటిలో 24 ఫిర్యాదులపై చర్యలు తీసుకున్నట్లు కంపెనీ స్పష్టం చేసింది. ఎండ్ టు ఎండ్ ఎన్ క్రిప్టెడ్ మెసేజింగ్ సర్వీస్ లలో దుర్వినియోగాన్ని నిరోధించడంలో వాట్సాప్ పరిశ్రమ అగ్రగామిగా ఉన్నట్టు నిపుణులు చెప్తున్నారు.
కొన్ని సంవత్సరాలుగా తమ ప్లాట్ ఫారమ్ లో మా వినియోగదారులను సురక్షితంగా ఉంచడానికి అనేక చర్యలను తీసుకున్నట్టు సంస్థ తెలిపింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోపాటు ఇతర అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, డేటా సైంటిస్టులు, నిపుణులను ఉపయోగిస్తున్నామని కంపెనీ తెలిపింది.
ఇదిలా ఉంటే.. కొత్త ఐటీ రూల్స్ 2021కి అనుగుణంగా డిసెంబర్ లో ఫేస్ బుక్ లోని 13 కేటగిరీలలో 19.3 మిలియన్లకు పైగా ఇబ్బందికరమైన కంటెంట్ లను, ఇన్ స్టాగ్రామ్ లో 12 కేటగిరీలలో 2.4 మిలియన్ల కంటెంట్ లను తొలగించినట్లు మెటా తెలిపింది.