అర్హులైన వారందరికీ ఇళ్ల పట్టాలను జారీ చేయాలనీ ఆదేశించారు ఏపీ సీఎం జగన్. ఈ మేరకు పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి అధికారులతో సమావేశమైన జగన్.. క్షేత్రస్థాయిలో పరిశీలించి అర్హులకు ఇళ్ల పట్టాలను అందించాలని ఆదేశించారు. ఎంతమంది ఉన్న అర్హులైన వారందరికీ ఇళ్ల పట్టాలను ఇవ్వాలని ఆదేశాలిచ్చారు.
ఇదిలా ఉండగా… గ్రామ సచివాలయంలో, రైతు భరోసా కేంద్రాల్లో ఖాళీలను భర్తీ చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. ఫిబ్రవరి నుంచి విలేజ్ వాలంటీర్ల ద్వారా ఇంటింటికీ వెళ్లి ఫించన్లను అందజేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ ఆర్ధిక సంవత్సరం ముగింపు నాటికి కొత్తగా 3000ఉద్యోగాలను భర్తీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. 300గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేసి 3000ఉద్యోగాలను ఫీల్ చేసేందుకు రెడీ అవుతున్నారు. గ్రామ సచివాలయాల్లో ఇప్పటికే ఉన్న 15, 971ఖాళీలను కలుపుకొని మొత్తం 18,971పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు అధికారులు తెలిపారు.