నేషనల్ అకాడమీ ఆష్ కన్‌స్ట్రక్షన్ లో భారీగా ఉద్యోగాలున్నాయి. హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డ్ త్వరలో చేపట్టబోయే ప్రాజెక్ట్స్ కోసం ఔట్‌సోర్సింగ్ పద్దతిలో సైట్ ఇంజనీర్లను తీసుకోబోతున్నారు. మొత్తం 50 మంది ఇంజనీర్లను తీసుకోనున్నట్లు నోటిఫికేషన్ విడుదలైంది.
అయితే, మల్టీజోన్-2లో ఉన్న ప్రాంతం వారికి మాత్రమే ఈ చాన్స్ ఉంది. ఈ జోన్‌లో సూర్యపేట, నల్గొండ, భువనగిరి, యాదాద్రి, జనగాం, మేడ్చల్-మల్కాజ్‌గిరి, హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్, మహబూబ్‌నగర్, జోగులాంబ గద్వాల, వనపర్తి, నాగర్ కర్నూల్ జిల్లాల స్థానికత ఉన్నవారు మాత్రమే అర్హులు.
ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాగా.. నవంబర్ 27వరకు చివరి తేదీ. 2019 నవంబర్ 1 నాటికి 44 ఏళ్ల వయస్సు ఉన్న వారు అర్హులు కాగా… నవంబర్ 18 నుండే దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం అయింది.
విద్యార్హత— సివిల్ ఇంజనీరింగ్ బీఈ, బీటెక్, ఏఎంఐఈ