మాజీ మంత్రి ఈటల రాజేందర్ హుజురాబాద్ లో ఒంటరి పోరాటం చేస్తున్నారు. అధికార టీఆర్ఎస్ నుండి మంత్రులంతా అక్కడే మకాం వేశారు. దళిత బంధు, అభివృద్దికి నిధులు, ఈటల వర్గంలో ఉన్న నేతలను తమ దారికి తెచ్చుకోవటం ఇలా ఏ చిన్న అంశాన్ని వదలటం లేదు. పైగా ఉప ఎన్నిక షెడ్యూల్ వాయిదా పడటంతో ఈటల వర్గంలో అసంతృప్తి నెలకొంది.
కేసీఆర్ తో ఉన్న దోస్తీతోనే ఉప ఎన్నిక వాయిదా పడిందని, ఈటలను బీజేపీ నిండా ముంచిందన్న ప్రచారం జరిగింది. కానీ నిర్మల్ లో అమిత్ షా సభ ఈటలకు చాలా ప్లస్ గా మారుతుంది. నిర్మల్ సభలో అమిత్ షా ఒకటికి రెండుసార్లు ఈటలలో జోష్ నింపే ప్రయత్నం చేశాడు. ఈటల కాస్త మొహమాటంగా కనపడ్డా… షా స్వయంగా చొరవ తీసుకొని ఈటలను జనాలకు కనపడాలని, ముందుకు రావాలని కోరారు. తనతో చేయి కలిపి… బీజేపీ శ్రేణులకు అభివాదం చేశారు.
మామలుగా అమిత్ షా అంతటి నాయకుడు రాష్ట్ర నాయకత్వంతో అంత చొరవగా ఉండరు. కానీ అక్కడ మీటింగ్ లో ఈటలకు వస్తున్న రెస్పాన్స్ తో పాటు హుజురాబాద్ పై తనకు కూడా కచ్చితంగా ప్రత్యేకంగా నివేదికలు అందుతాయి. అందుకే గతంలో ఎప్పుడూ లేనంతగా అమిత్ షా ఈటలతో ప్రేమగా వ్యవహరించిన తీరు ఈటలకు, ఆయన వర్గానికి కొత్త బూస్ట్ ఇచ్చినట్లు పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అమిత్ షా తెలంగాణ టూర్ బీజేపీకి ఎంత ఉపయోగపడిందో ఏమో కానీ ఈటల రాజేందర్ కు మాత్రం భరోసా కలిగించిందన్న అభిప్రాయం వినిపిస్తుంది.