కొద్ది కాలం క్రితమే తల్లిగా ప్రమోషన్ పొందిన సోనమ్ కపూర్ అహుజా… ఆ అనుభూతిని ఆస్వాదిస్తోంది. ఆగస్ట్ 20న ఆమెకు మగబిడ్డ జన్మించాడు. కొద్ది రోజుల క్రితమే కుమారుడి పేరును వాయు కపూర్ అహుజాగా సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంది.
తాజాగా సోనమ్ కర్వా చౌత్ వేడుకలను జరుపుకుంది. తన తల్లి సునీతా కపూర్ తో కలిసి ముంబై లోని వారి నివాసంలో ఈ వేడుకల్లో కనిపించింది. ఈ వేడుకలలో సోనమ్ అతిథులతో చాలా సరదాగా గడిపినట్లు సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంది.
సోనమ్ రాణి పింక్ సిల్క్ చీరలో మనోహరంగా ఉంది. దానికి తగినట్లుగా గ్రీన్ కలర్ బ్లౌజ్ తో పాటు నగలతో నిండుగా ఉంది. అంతేకాకుండా తక్కువ మేకప్ తో సోనమ్ మరింత మనోహరంగా ఉంది. కొద్ది రోజుల క్రితమే సోనమ్ కుమారుడి నామకరణ వేడుకలకు సంబంధించిన చిత్రాలను అభిమానులతో పంచుకుంటూ తన కుమారుడి పేరును కూడా తెలిపారు సోనమ్ దంపతులు.
“మన జీవితాల్లో కొత్త అర్థాన్ని నింపిన శక్తి స్ఫూర్తితో… అపారమైన ధైర్యాన్ని మరియు శక్తిని మూర్తీభవించిన హనుమంతుడు, భీమ్‌ల స్ఫూర్తితో… పవిత్రమైన, జీవనాధారమైన మరియు శాశ్వతంగా మనది. మా కొడుకు వాయు కపూర్ అహుజా కోసం మేము ఆశీర్వాదాలు కోరుతున్నాము, ”అని సోనమ్ ఆనంద్ తమ ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లలో రాశారు.
సోనమ్ చివరిగా 2019లో విడుదలైన ది జోయా ఫ్యాక్టర్ లో కనిపించింది. అభిషేక్ శర్మ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్‌తో కలిసి సోనమ్ కపూర్ స్క్రీన్ షేర్ చేసుకుంది.