తెలంగాణ పీసీసీ చీఫ్ ఎంపికను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు పార్టీ ఇంచార్జ్ మాణికం ఠాగూర్ అధికారికంగా ప్రకటించారు. వరంగల్, ఖమ్మం మున్సిపల్ ఎన్నికలతో పాటు నాగార్జున సాగర్ ఉప ఎన్నిక పూర్తయ్యే వరకు పీసీసీ చీఫ్ ప్రకటన ఉండదని తెలిపారు. అప్పటి వరకు ఉత్తమ్ కుమార్ రెడ్డి పీసీసీ అధ్యక్షునిగా కొనసాగుతారని తెలిపారు.
మాజీ మంత్రి జానారెడ్డి తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి కీలకమైన వ్యక్తి అని, ఆయన సూచన మేరకు వాయిదా వేస్తున్నామన్నారు. అయితే, ఇప్పటికీ పీసీసీ చీఫ్ ఎవరు అన్నది ఖరారు కాలేదని, ఎంపిక ప్రక్రియ కొనసాగుతుందన్నారు. సోనియాకు రాష్ట్రంలో పరిస్థితి వివరించామని, ఎన్నికలపై ముందుగా ఫోకస్ చేసే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. సాగర్ ఎన్నిక తర్వాత 2023ఎన్నికలే టార్గెట్ గా పదవుల నియామకం ఉంటుందని తెలిపారు.
ఇక పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్లు సహా ఇతర కమిటీలు కూడా ఇలాగే కొనసాగుతాయన్నారు.