వాట్సప్ వినియోగదారుల్లో చాలా మంది వెబ్ వాట్సప్ ఉపయోగిస్తుంటారు. అయితే, వెబ్ వాట్సప్ నిబంధనల్లో పలు మార్పులకు వాట్సప్ శ్రీకారం చుట్టింది. అతి త్వరలోనే ఈ మార్పులను తప్పనిసరి చేయనుంది.
WhatsApp Web Latest Policy Update
వెబ్ వాట్సప్ కు ఇక నుండి బయోమెట్రిక్ అథెంటికేషన్ ను అందుబాటులోకి తీసుకరానుంది. ఈ విషయాన్ని వాట్సప్ అధికారికంగా ప్రకటించింది. ప్రస్తుతం వాట్సాప్ వెబ్‌ను ఉపయోగించేవారు క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేస్తే సరిపోతుంది. అయితే.. ఈ విధానం దుర్వినియోగం కాకుండా ఉండేందుకు బయోమెట్రిక్ విధానాన్ని ప్రవేశపెట్టనున్నట్లు వాట్సాప్ ప్రకటించింది.
వాట్సాప్ వెబ్‌లోని క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసే ముందు… సదరు వినియోగదారుడు తన వేలిముద్ర లేదా ఫేస్ రికగ్నిషన్ చేయాల్సి ఉంటుంది. వాట్సాప్ వినియోగదారుల డేటాను మరింత సేఫ్ గా ఉంచేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. అయితే, ఈ నిర్ణయంపై మిశ్రమ స్పందన వస్తుంది.
ఈ కొత్త పాలసీ ఎప్పటి నుండి అమల్లోకి వస్తుందనేది మాత్రం ఇంకా ప్రకటించలేదు.