వినియోగదారుల సౌలభ్యం కోసం ఎప్పటికప్పుడు తనను తాను మార్చుకునే గూగుల్ మరో కొత్త పాలసీతో రానుంది. వినియోగదారుల ఖాతాలో జీ మెయిల్, గూగుల్ డ్రైవ్‌లోని క్రియా రహితంగా పరిమితికి మించి ఉన్న వాటి కోసం ప్రత్యేక ఫీచర్ తీసుకరానుంది. వచ్చే ఏడాది జూన్ 1 నుంచి అమల్లోకి రానున్న గూగుల్ కొత్త పాలసీతో డాక్స్, షీట్లు, సైడ్లు, డ్రాయింగ్‌లు, జూమ్‌బోర్డు ఫైల్స్, ఫొటో పరిశ్రమలకు సేవలు ఇక నుంచి సాధారణ పద్ధతులతో మరింత మెరుగ్గా ఉంటాయని గూగుల్ తెలిపింది. వచ్చే ఏడాది జూన్ 1 నుంచి మీరు ఒకటి, అంతకంటే ఎక్కువ సేవల్లో రెండు సంవత్సరాలు ఉపయోగించనటైతే మీ ఖాతాలోని క్రియారహితంగా ఉన్న సమాచారాన్ని గూగుల్ తొలగించనుంది.
అదేవిధంగా మీ స్టోరేజీ పరిమితి రెండేళ్లు దాటినట్లయితే జీమెయిల్, డ్రైవ్, ఫోటోల్లో కంటెంట్‌ను తొలగిస్తామని, తొలగించే ముందు ఒకటికి రెండుసార్లు వినియోగదారుల దృష్టికి తెస్తామని తెలిపింది. మీ ఖాతాను చురుగ్గా ఉంచడానికి మీరు ఎప్పటికప్పుడు జీమెయిల్, డ్రైవ్, ఫొటోలను చూస్తూ ఉండాలని సూచించింది. సైన్ ఇన్ చేస్తున్నప్పుడు ఇంటర్నెట్ కనెక్ట్ చేశారని గూగుల్ ఒక రికార్డు చేసుకుంటుందని తెలిపింది.