అక్కినేని నాగార్జున వారసుడు అక్కినేని అఖిల్ హీరోగా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రం మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్. కెరీర్ ప్రారంభించి 3 సినిమాలు చేసినప్పటికీ చెప్పుకో దగ్గ హిట్ ను అందుకోలేకపోయాడు అఖిల్. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా పై కాస్త ఎక్కువగా ఆశలు పెట్టుకున్నాడు. కాగా ఈ చిత్రంలో అఖిల్ సరసన బుట్టబొమ్మ పూజా హెగ్డే నటిస్తుంది.
ఇప్పటికే ఈ ఇద్దరి లుక్స్ అందరినీ ఆకట్టుకోగా సంక్రాంతి సందర్భంగా మరో కొత్త పోస్టర్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ఈ పోస్టర్ చూస్తే అఖిల్, పూజాల మధ్య కెమిస్ట్రీ అద్భుతంగా కుదిరిందని మరో సారి అర్థం అవుతుంది. ఇక ఈ సినిమా వేసవిలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్టు పోస్టర్ ద్వారా ప్రకటించారు.
Happy Sankranthi to all you. May this new year bring you all the joy and success you deserve. Much love to you all. #AlluAravind @hegdepooja @baskifilmz @GopiSundarOffl #PradeeshVarma #BunnyVas #VasuVarma @adityamusic @GA2Official pic.twitter.com/ScW7kaD2dG
— Akhil Akkineni (@AkhilAkkineni8) January 13, 2021