ఈ రోజుల్లో ఎటిఎం అవసరం లేని వాళ్ళు ఎవరూ లేరు. ఎటిఎం విషయంలో ప్రతీ అంశం చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. చాలా మందికి ఎటిఎం విషయంలో అవగాహన ఉన్నా సరే తప్పులు ఎక్కువగా చేస్తున్నారు. ఈ తప్పులు ఎక్కువ ప్రభావం చూపిస్తున్నాయి. ప్రధానంగా ఈ మధ్య కాలంలో బ్యాంకులు వింటున్న సమస్య ఒకటి ఉంది. గతంలో పిన్ మర్చిపోయాం అని చెప్పే వినియోగదారులు ఇప్పుడు ఎటిఎం మర్చిపోయాం అని చెప్తున్నారు.
ఎటిఎం మర్చిపోవడం ఏంటీ అంటారా…? గతంలో అంటే చిప్ లు ఉండేవి కాదు. ఎటిఎం కార్డుని మెషిన్ లో పెట్టి వెంటనే తీసేస్తే చాలు. అది లోడ్ అయి మనం డబ్బులు తీసుకోవచ్చు. కాని ఇప్పుడు చిప్ కార్డులు వచ్చాయి. చిప్ కార్డుల వలన కొన్ని సమస్యలు తీవ్రంగా ఉంటున్నాయి. చిప్ కార్డులు వచ్చినప్పటి నుంచి ఎటిఎంలు సాఫ్ట్ వేర్ మార్చారు. మనం నగదు తీసుకునే వరకు కార్డు మెషిన్ లోనే ఉండాల్సి ఉంటుంది.
ఇప్పుడు ఇదే సమస్యగా మారింది. ఎటిఎంలో డబ్బులు తీసుకుని బయటకు వచ్చేస్తున్నారు. ఎటిఎం అవసరం వచ్చిన సమయంలో అది మర్చిపోయాం అనే విషయం గుర్తుకు వస్తుంది. ఈ సమస్యతో చాలా మంది బాధ పడుతున్నారు. ఎటిఎంలు పోయిన ఫిర్యాదుల్లో సగం ఇవే ఉంటున్నాయి. కొన్ని చోట్ల సెక్యూరిటీ గార్డులు తీసి భద్ర పరుస్తున్నారు. మరికొన్ని చోట్ల వేరే వినియోగదారులు తీసి బయటపడేస్తున్నారు. దీని వల్ల సెక్యూరిటీ సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది. ఇలా చాలా మంది కార్డు బ్లాక్ చేసుకుంటున్నారు. డబ్బులు తీసుకునే సమయంలో శ్రద్ధ పెడితే ఈ సమస్య ఉండదు అంటున్నారు.