జాతీయ పల్స్ పోలియో కార్యక్రమం ఈనెల 17న ఉండగా… కరోనా వ్యాక్సినేషన్ మొదలవుతుండటంతో కేంద్రం వాయిదా వేసింది. త్వరలో కొత్త తేదీ ప్రకటిస్తామని చెప్పిన కేంద్ర వైద్యారోగ్య శాఖ తేదీ ఖరారు చేసింది. ఐదేళ్లలోపు చిన్నారులకు ఈనెల 31న పోలియో చుక్కలు వేయాలని నిర్ణయించారు.
కొత్త తేదీలను ఖరారు చేస్తూ నేషనల్ పల్స్ పోలియో ఇమ్యునైజేషన్ సలహాదారు ప్రదీప్ హల్డర్ రాష్ట్రాలకు సమాచారం అందించారు.