ఆఫ్ఘనిస్తాన్….రేపు రేపు క్రికెట్ లో బలంగా వినిపించే పేరు కాబోతుంది! ఆ ఆటగాళ్ల డెడికేషన్ ఆ లెవల్లో ఉంది.! ఇప్పటికే ఐపియల్ లో ఆ ఆటగాళ్ల మెరుపు మనం చూస్తూనే ఉన్నాం…తాజాగా ఆఫ్ఘనిస్తాన్ తరఫున 19 ఏళ్ళ రెహ్మానుల్లా సరికొత్త రికార్డులను క్రియేట్ చేశాడు.
అబుదాబిలో ఐర్లాండ్ పై జరిగిన మ్యాచ్ లో ఆఫ్ఘనిస్తాన్ వికెట్ కీపర్ రెహ్మానుల్లా సెంచరీ చేశాడు. రెహ్మానుల్లా కు ఇదే ఫస్ట్ మ్యాచ్. ఇలా ఫస్ట్ మ్యాచ్ లోనే సెంచరీ చేసిన తొలి ఆఫ్ఘనిస్తాన్ క్రికెటర్ గా చరిత్రకెక్కాడు.
ఫస్ట్ మ్యాచ్ లోనే ఎక్కువ పరుగులు :
మొదటి మ్యాచ్ లోనే ఎక్కువ పరుగులు చేసిన రెండవ ఆటగాడిగా రెహ్మానుల్లా చరిత్రకెక్కాడు. డెస్మండ్ హేన్స్ తను ఆడిన ఫస్ట్ మ్యాచ్ లోనే ఆస్ట్రేలియాపై 148 పరుగులు చేశాడు. తర్వాత రెహ్మానుల్లా 127 పరుగులు చేసి సెకండ్ ప్లేస్ లో ఉన్నాడు. ఇక అతి తక్కువ వయస్సులో సెంచరీ చేసిన ఫస్ట్ బ్యాట్స్ మెన్ మాత్రం ఇతనే!
ఫస్ట్ మ్యాచ్ లోనే ఎక్కువ సిక్సులు :
ఈ రికార్డ్ ఈ మ్యాచ్ కు ముందు సిద్దూ పేరిట ఉండేది. సిద్దూ 1987 లో ఆస్ట్రేలియాతో తొలి వన్డే మ్యాచ్ ఆడాడు.ఆ మ్యాచ్ లో 4 ఫోర్లు, 5 సిక్సర్ల సహాయంతో 73 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్ లో రెహ్మానుల్లా 9 సిక్సులు, 8 ఫోర్లు కొట్టి కొత్త రికార్డ్ క్రియేట్ చేశాడు.