యంగ్ టైగర్ ఎన్టీయార్, మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న మూవీ ఆర్.ఆర్.ఆర్. బాహుబలి విజయంతో ఈ చిత్రంపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలున్నాయి. పైగా చిత్ర యూనిట్ విడుదల చేసిన టీజర్లు యూట్యూబ్ లో సంచలనంగా మారాయి.
దసరా సందర్భంగా విడుదలైన రామరాజు ఫర్ భీమ్ యూట్యూబ్‌లో సరికొత్త రికార్డులు సృష్టిస్తున్నవీడియో తాజాగా మరో అరుదైన రికార్డును ఖాతాలో వేసుకుంది. అక్టోబర్ 22న విడుదలైన ఈ టీజర్ ఇప్పటికి 5 లక్షలకు పైగా కామెంట్లను దక్కించుకుంది. ఈ స్థాయిలో కామెంట్లు దక్కించుకున్న టీజర్ టాలీవుడ్‌లో ఇదొక్కటే కావటం విశేషం. 3.5కోట్లకు పైగా వ్యూస్ సంపాదించుకుంది.