గ్రేటర్ ఎన్నికలకు మరికొన్ని గంటలే సమయం ఉండటతో.. ఓటర్లను ప్రలోభపెట్టేందుకు తీవ్రంగా పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. పార్టీ కార్యకర్తలతో డబ్బులు పంపిణీ చేస్తే దొరికిపోతుండటంతో.. అభ్యర్థులు ఆ పని కసం కొత్త మార్గాన్ని ఎంచుకున్నాయి. పోలీసులు, ప్రత్యర్థులకు అనుమానం రాకుండా చిన్న పిల్లలతో డబ్బు పంపిణీ చేస్తున్నాయి.
ఎల్బీనగర్ నియోజకవర్గ పరిధిలో గడ్డిఅన్నారం డివిజన్‌లో చిన్నారులు ఓటర్లకు డబ్బులు పంపిణీ చేస్తూ కెమెరాకు చిక్కారు. అయితే తాము డబ్బులు పంచుతుండగా వీడియో తీస్తున్నట్టు గ్రహించిన చిన్నారులు.. అక్కడి నుంచి జారుకున్నారు. అయితే డబ్బులు పంపిణీ చేస్తున్న పార్టీ ఏదో తెలియలేదు.