న్యాయ విద్యార్థినిపై అత్యాచారం కేసులో జైలులో ఉన్న కేంద్ర మాజీ మంత్రి చిన్మయానంద రాసిన లేఖ సంచలనం రేపుతుంది. షాజహాన్ పూర్ జైలులో ఉన్న చిన్మయానంద షాజహాన్ పూర్ ఎస్పీ కి లేఖ రాశారు. తనపై లైంగిక ఆరోపణలు చేసిన న్యాయ విద్యార్థిని పై ఆరోపణలు చేస్తూ..తనకి మస్సాజ్ చేస్తూ మరో ముగ్గురు సంజయ్, సచిన్, విక్రమ్ సాయంతో వీడియోలు తీసిందని, ఆ వీడియోలు తనకి చూపించి 5 కోట్లు డిమాండ్ చేసిందని ఆరోపించారు. ఆమెపై గ్యాంగ్ స్టార్ యాక్ట్ కింద కేసు నమోదు చెయ్యాలని ఆయన కోరారు. మరోవైపు చిన్మయానంద తరపు న్యాయవాది చీఫ్ జుడీషియల్ మేజిస్ట్రేట్‌కు పిటిషన్ సమర్పించారు.