హయత్ నగర్ రజిత మర్డర్ కేస్ ను చేదించిన పోలీసులు నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా మహేష్ భగవత్ మాట్లాడుతూ మృతురాలు కూతురు కీర్తి రెడ్డి నిందితురాలిగా గుర్తించామన్నారు. కీర్తి రెడ్డినిస్నేహం పేరుతో బాల్ రెడ్డి అనే వ్యక్తి వశపరుచుకున్నాడు. అనంతరం బాల్ రెడ్డి శశి కుమార్ సహాయంతో అబార్షన్ చేయించాడు. కీర్తి రెడ్డి ఆస్తి పై కన్నేసిన శశి దీనిని అదునుగా తీసుకుని ఇంట్లో చెప్తా అని కీర్తి రెడ్డిని బెదిరించి ట్రాప్ చేశాడు. శశితో వివాహానికి కీర్తి తల్లి నిరాకరించటంతో రజితను చంపాలని నిశ్చయించుకున్నారు. శశి సహాయంతో కీర్తి తల్లి రజితను హత్య చేసింది. అనంతరం మృతదేహాన్ని రామన్నపేట రైల్వే ట్రాక్ పై పడేశారు. ఇంతకు ముందు కూడా రజితను చంపటానికి నిద్ర మాత్రలు ఇచ్చి చంపాలని చూశారని మహేష్ భగవత్ తెలిపారు.
రజిత ను హత్య చేసిన తరువాత రజిత ఫోన్ నుండి ప్రియుడు బాల్ రెడ్డి కి స్వయంగా కీర్తి ఫోన్ చేసి తల్లి లాగా మాట్లాడింది. నేను వైజాక్ కి వెల్లుతున్న, కీర్తి ఇంట్లో ఉంటుందని చెప్పి తల్లిగా మాట్లాడింది. శశి కుమార్ , కీర్తి ఇద్దరు సన్నిహితంగా ఉన్న సమయంలో ఫోటోలు , వీడియోలు తీసుకున్నారు. వాటిని చూపించి కీర్తి రెడ్డి ని బ్లాక్ మెయిల్ చేశాడు శశి. దీంతో శశి కి భయపడి కీర్తి హత్య చేసింది. మర్డర్ తరువాత మృత దేహం తరలించే టప్పుడు కీర్తికి శశి మద్యం తాగించాడు. రజిత ను హత్య చేసిన తరువాత ఇంట్లో ఉన్న10 లక్షలు తీసుకోవాలని భావించారు. బాలరెడ్డి పై 376 (2) (n) , 312 , section 5&6 పొక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేశాము. శికుమార్, కీర్తి పై 302 , 201, 203 , రెడ్ విత్ 34- ఐపీసీ కింద కేసులు నమోదు చేశామని మహేష్ భగవత్ తెలిపారు.