వరంగల్ జిల్లాలో ఉపాది కూలీలు బావిలో శవం అయి తేలటం సంచలనంగా మారింది. గీసుకొండ మండలం గొర్రెకుంట బావిలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మృతదేహలు లభ్యంకాగా, తాజాగా మరో మృతదేహన్ని పోలీసులు గుర్తించారు.
20ఏళ్లుగా స్థానికంగానే ఉంటున్న బీహర్ కుటుంబం ఉపాది లేక ఆత్మహత్యకు పాల్పడిందా…? ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా..? అన్న కారణాలపై విచారణ సాగుతోంది.
అయితే, ఇప్పటికే గుర్తించిన ఐదు మృతదేహలు మక్సూద్ కుటుంబానికి చెందినవని పోలీసులు బావిస్తున్నారు. కొద్దిరోజుల క్రితం మక్సూద్ ఇంట్లో తన మనువడి బర్త్ డే వేడుకలకు బీహర్ యువకులు కూడా హజరయ్యారని తెలుస్తోంది. అయితే మక్సూద్ కూతురు బుస్రా తన భర్తతో విడిపోయి తల్లితండ్రుల వద్దే ఉంటుంది. మక్సూద్ కూతురు విషయంలోనే వివాదం ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందటంతో… విష ప్రయోగం ఏమైనా జరిగిందా…? బావిలో మరో మృతదేహం ఉందా…? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.