హైకోర్టు న్యాయవాద దంపతులు గట్టు వామన్ రావు, గట్టు నాగమణిపై హత్యల విషయంలో జరుగుతున్న దర్యాప్తు తీరు అనేక సందేహాలకు తావిస్తోంది. ఒక గ్రామానికి సంబంధించిన వివాదంగా చూపుతూ ఒకరిద్దరిని మాత్రమే నిందితులుగా చిత్రీకరించే ప్రయత్నాలు జరుగుతున్నాయన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కానీ వామన్‌రావు దంపతులు పోలీస్ స్టేషన్లలో పెట్టిన కేసులు, కోర్టుల్లో దాఖలు చేసిన పిటిషన్లను చూస్తోంటే పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధు నుంచి.. ఆ జిల్లా పోలీసులు, అధికార పార్టీకి చెందిన చాలా మంది నాయకులు వామన్‌రావు దంపతులపై చాలా కాలంగా కక్ష పెంచుకొని ఉన్నారన్న వాదనలకు బలం చేకూరుతోంది.
గట్టు లా చాంబర్స్ సంస్థ అధినేతలుగా, హైకోర్టు న్యాయవాదులుగా గట్టు వామన్ రావు, ఆయన సతీమణి ఉమ్మడి కరీంనగర్ మరీ ముఖ్యంగా మంథని ప్రాంతానికి సంబంధించి అనేక అక్రమాల్లో పుట్ట మధు, టీఆర్ఎస్‌లోని ఇతర నేతలు అలాగే పోలీసుల పాత్రపై దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు,రిట్లు, కేసుల్లో ప్రధానమైన వాటి జాబితా ఇదే.
–పుట్ట మధు తాను ఎమ్మెల్యే కాగానే మంథని జేఎన్టీయూలో ఔట్ సోర్సింగ్ నర్సింగ్ ఉద్యోగులు 100 మందిని తొలగించారని ఆయనపై హైకోర్టులో కేసు
–2016లో మంథని మాజీ ఉప సర్పంచ్ ఇనుముల సతీస్ ఇంటిపై దాడి చేసిన కేసులో అప్పటి సర్పంచ్ పుట్ట శైలజతో పాటు ఎస్ఐ మస్తాన్, మరో16 మందిపై మంథనిలో కేసు
–2018లో గోపాల్‌పూర్ మహిళపై అత్యాచారంపై హైకోర్టులో కేసు
-అప్పటి సీఐ దాసరి భూమయ్యపై మహిళను అవమానించిన కేసులో మంథని కోర్టులో కేసు
-2018లో పుట్ట లింగమ్మ చారిటబుల్ ట్రస్ట్, పుట్ట మధుకర్‌పై హైకోర్టులో పిల్ దాఖలు
-2019లో మంథని కాలేజీ గ్రౌండ్‌లో జరిగిన కుమారుని వివాహ వేడుకల కోసం గ్రౌండ్‌లో ఉన్న భవనాలను కూల్చివేశారని ఆరోపిస్తూ హైకోర్టులో పిల్
–గుంజపడుగు గ్రామ పంచాయతీ భవనం కూల్చివేతపై పలు కోర్టుల్లో కేసులు
–చిన్న ఓదెల భూముల వివాదంలో పోలీసుల జోక్యంపై అప్పటి మంథని ఎస్ఐ, ప్రస్తుతం రామగిరి ఎస్ఐ మహేందర్‌పై కోర్టులో ప్రైవేట్ కేసు
–మంచిర్యాల భూవివాదంలో అప్పటి సీఐ ఎడ్ల మహేశ్‌పై హైకోర్టులో కేసు
–చెన్నూరులో ఒక మహిళ ఆత్మహత్య కేసులో ఏసీపీ నరేంద్ రెడ్డిపై ప్రవేట్ కేసు
-పెద్దపల్లిలో ప్రైవేట్ ఆస్పత్రిలో ఒక మహిళకు అపరేషన్ వికటించిన విషయంలో హైకోర్టులో కేసు
-పుట్ట మధు తదితరులపై కేసుల కొట్టివేతపై తెచ్చుకున్న జీవోను సవాల్ చేస్తూ నాంపల్లి ప్రత్యేక కోర్టులో కేసు
-మంథని మున్సిపల్ చైర్మన్ పుట్ట శైలజ ఎన్నికల అఫిడవిట్ ప్రకారం అనర్హత ప్రకటించాలని కరీంనగర్ ఎన్నికల వివాదాల ట్రిబ్యునల్ కోర్టులో కేసు
-అప్పటి జిల్లా కలెక్టర్ దేవసేన, అప్పటి డీపీఓ వేముల సుదర్శన్‌పై హైకోర్టులో కేసులు
-ఎడ్ల శీను తదితరులపై పెట్టిన పీడీయాక్ట్ కేసు కొట్టివేయించిన కేసు
-మంథని మండలం వెంకటాపూర్ ఇసుక క్వారీతో పాటు మరో 24 ఇసుక క్వారీలపై హైకోర్టులో పిల్
-మంథని గ్రామం పంచాయతీ లీజు భూములపై హైకోర్టులో పిల్
–బసంత్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధితో ఒక మహిళను లైంగికంగా వాడుకొని మోసం చేసిన కేసు
-సిరిపురం భూనిర్వాసిత రైతు దాసరి చంద్రమోహన్‌పై పోలీసులు థర్డ్ డిగ్రీపై అప్పటి మంథని ఎస్ఐ ఉపేందర్‌పై హెచ్చార్సీలో కేసు
-పుట్ట మధు సోదరుడి కుమార్తె ప్రేమ వివాహంలో హెచ్చార్సీలో కేసు
–గుంజపడుగు గ్రామంలోని పలు భూముల వివాదాల్లో కేసులు
-ప్రధానంగా శీలం రంగయ్య లాకప్‌డెత్ కేసులో పిల్
-మైనార్టీ యువకుడు షబ్బీర్‌పై టీఆర్ఎస్ నాయకులు చేసిన దాడిలో బెయిల్
-కరీంనగర్ జిల్లా బెజ్జంకిలో 700 ఎకరాలకు సంబంధించి భూనిర్వాసితుల పక్షాన హైకోర్టులో కేసులు
-గత 7 సంవత్సరాలుగా మంథని ప్రాంతంలో అధికార పార్టీ నాయకుల అక్రమాలు, పోలీసులు తీరుపై వివిధ వర్గాలకు చెందిన బాధితుల పక్షాన స్థానిక కోర్టుల నుంచి హైకోర్టు, సుప్రీం కోర్టు, మానవ హక్కుల కమిషన్, ఎస్సీ, ఎస్టీ కమిషన్, సమాచార హక్కు కమిషన్లలో అనేక పిటిషన్లు