ఏపీలో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సోమవారమే సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినప్పటికీ.. ఇంకా ఆటంకాలు వెంటాడుతూనే ఉన్నాయి. మొన్నటి తీర్పునకు ముందే పంచాయతీ ఎన్నికలను వాయిదా వేయాలని హైకోర్టులో మరో పిటిషన్ దాఖలు కాగా.. దానిపై విచారణ ఎల్లుండికి వాయిదా పడింది.
2019 ఓటరు జాబితా ప్రకారం ఎన్నికల నిర్వహిస్తే.. ఆ తర్వాత 18 ఏళ్లు నిండిన యువత ఓటు హక్కు కోల్పోతుందని అడ్వకేట్ శివప్రసాద్ రెడ్డి..కోర్టులో సోమవారం ఈ పిటిషన్ దాఖలు చేశారు. కాగా ఆ సమయంలో రాష్ట్ర ప్రభుత్వం, ఎస్‌ఈసీ సుప్రీంకోర్టుకు వెళ్లి ఉండటంతో ఆరోజు విచారణ వాయిదా వేసింది హైకోర్టు. తాజాగా మరోసారి ఎల్లుండి విచారణ జరుపుతామని చెప్పగా… ఎల్లుండి ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందని న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఈ పిటిషన్‌పై రేపే విచారణ జరుపుతామని కోర్టు తెలిపింది.