సీనియర్ నటుడు నరేష్,పవిత్రలు తమ పై వస్తున్న పుకార్లకు ఎండ్ కార్డ్ వేశారు. కొత్త ఏడాదిలో తామిద్దరం పెళ్ళి చేసుకొని కొత్త జీవితాన్ని ప్రారంభిస్తున్నట్టు ప్రకటించేశారు. ఈ మేరకు నరేష్ తన ట్విట్టర్ ద్వారా అభిమానులకు న్యూ ఇయర్ శుభాకాంక్షలు చెబుతూ..తన ప్రపంచంలోకి పవిత్రను ఆహ్వానిస్తూ ప్రత్యేక వీడియోను విడుదల చేయడం ఇప్పుడు మరింత ఆసక్తికరంగా మారింది.
వీడియోలో పవిత్రతో కేక్ కట్ చేయించిన నరేశ్.. ఆమెకు లిప్ కిప్ పెట్టి.. త్వరలోనే పెళ్ళి చేసుకొని కొత్త జీవితాన్ని ప్రారంభిస్తున్నట్లుగా ప్రకటించారు. ఈ ఏడాదికి ముగింపు పలుకుతూ తామిద్దరం వివాహం చేసుకోబోతున్నట్లు పవిత్ర నరేష్ యాష్ ట్యాగ్ పేరుతో వీడియో విడుదల చేయడంతో ఇప్పుడు టాలీవుడ్ తో పాటు సామాజిక మాద్యమాల్లో ఈ జంటకు సంబంధించి మరోసారి చర్చ మొదలైంది.
అయితే వీరి మధ్య సంబంధం గురించి మీడియాలో రకరకాలుగా కథనాలు వచ్చాయి. వాళ్లిద్దరు మైసూర్ లోని ఓ హోటల్ రూమ్ లో నరేష్ మూడో భార్య రమ్యకు రెడ్ హ్యండెడ్ గా దొరికినప్పుడు రచ్చ రచ్చే జరిగింది. రమ్య నరేష్ పై దాడికి దిగింది. అప్పుడు తామిద్దరం పెళ్లి చేసుకోవాలనుకుంటున్నట్టు నరేష్ పవిత్రలు చెప్పుకొచ్చారు. అయితే నరేష్ మూడో భార్య విడాకులకు ససేమిరా అనడంతో వీళ్లిద్దరి పెళ్లికి బ్రేకులు పడ్డాయి. ఇక వీళ్లిద్దరు కలిసి పండితుల దగ్గర జాతకాలు చూపించుకున్నారట. పండితులు కూడా ప్రస్తుతం వీళ్లిద్దరి గ్రహ స్థితిని చూసి వీరు పెళ్లి చేసుకుంటే బాగుంటుందని సలహా కూడా ఇచ్చారట. నరేష్ కూడా తన మూడో భార్యకు డ్రైవర్ తో అక్రమ సంబంధం ఉందంటూ బాంబు పేల్చారు.
ఈ నేపథ్యంలో నరేష్, పవిత్ర లోకేష్ ల పెళ్లి వ్యవహారం టాక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారింది. ఇక ఆయన ముగ్గురు భార్యలకు ముగ్గురు పిల్లలున్నారు. మైసూర్ హోటల్ సంఘటన జరిగిన తరువాత నరేష్, పవిత్ర లోకేష్ ఇద్దరు వేర్వేరుగా ఒక వీడియో విడుదల చేశారు. తమను రమ్య వేధిస్తోందని అందులో చెప్పారు. అప్పుడు వీరిద్దరు ఒకే గదిలో ఉండి వేర్వేరు వీడియోలు పంపించినట్టు నెటిజన్లు కూడా వీళ్లిద్దర్ని ఓ ఆట ఆడుకున్నారు. ఇంకొంత మంది అయితే నరేష్ నాలుగో పెళ్ళితో ఆగిపోతారా అన్న సందేహాన్ని కూడా వెలిబుచ్చుతున్నారు.