పలు దేశాల్లో నూతన సంవత్సర సంబురాలు మొదలయ్యాయి. ఇప్పటికే ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఫిజి, పపువా న్యూగీనియా వంటి ద్వీపాలు నూతన సంవత్సరంలోకి అడుగుపెట్టాయి. కిరిబతి దీవుల్లో భారత కాలమానం ప్రకారం ఈ రోజు మధ్యాహ్నం 3.30 గంటలకే అక్కడ నూతన సంవత్సరం మొదలైంది.
న్యూజిలాండ్ ప్రజలు నూతన సంవత్సర వేడుకలను ఘనంగా జరుపుకుంటున్నారు. భారత కాలమానం ప్రకారం సాయంత్రం 4.45 గంటలకే న్యూజిలాండ్ లో కొత్త సంవత్సరం మొదలైంది. మొదట అక్లాండ్ నగరంలో న్యూఇయర్ వేడుకలు మొదలయ్యాయి.
ఆక్లాండ్‌లో స్థానిక కాలమానం ప్రకారం రాత్రి 12 గంటలు కాగానే ప్రజలు రోడ్లపైకి వచ్చి కేరింతలు కొట్టారు. నగరమంతా లైట్ షోలతో మిల మిల మెరిసిపోయింది. జనాలు వీధుల్లోకి వచ్చి అంతా డప్పు చప్పుల్ల మధ్య సంబురాలు జరుపుకున్నారు.
ప్రజలంతా ఒకరికొకరు నూతన సంవత్సర శుభాకాంక్షలు జరుపుకున్నారు. దానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక హౌలాండ్, బాకర్ దీవులు అందరికన్నా చివరగా న్యూఇయర్ వేడుకలు జరుపుకోనున్నాయి.