మనం ఏదైనా ఓ పని చేసేటప్పుడు కొన్ని సాంప్రదాయాలు ఆచారాలు పాటిస్తాం. మనం చేసే పని సక్సెస్ కావాలని ముహూర్తాలు కూడా చూసుకుంటాం. అయితే ఆ మూలాలలోకి వెళ్తే ఆ ఆచారం పెట్టడానికి కారణం ఏంటనేది తెలుస్తుంది. కానీ ప్రస్తుతం ఉన్న జనరేషన్ లో కాలానికి అనుగుణంగా ఆచార వ్యవహారాలు మారిపోతూ వస్తున్నాయి. కానీ ఆషాడంలో పెళ్లి అయిన కొత్త దంపతులు ఒకచోట కలిసి ఉండకూడదు అనేది మాత్రం కంటిన్యూ అవుతూ వస్తుంది.
ఇప్పటికీ కూడా చాలామంది దానిని పాటిస్తారు. ఆషాడ మాసంలో అసలు ఎందుకు కలిసి ఉండకూడదు… అనేదాని గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. పూర్వం రోజుల్లో రకరకాల ఉద్యోగులు, వృత్తులు లేవు. ఎవరైనా సరే వ్యవసాయం మీదే ఆధారపడి జీవించేవారు. అయితే ఆషాడ మాసంలో వాతావరణం మార్పులు సంభవిస్తాయి. ఎక్కువగా చలి ఉండడం, అకారణంగా వర్షాలు పడటం లాంటివి అలాగే నదులు, కాలువలు పొంగి పొరలటం, వైరస్ బ్యాక్టీరియాలు ఎక్కువ అవటం వంటివి జరుగుతాయి.
హీరోయిన్ శోభితతో నాగ చైతన్య కు ఉన్న సంబంధం ఏంటి ?
ఆ సమయంలో పెళ్లైన కొత్త దంపతులు కలిసి ఉంటే అదే సమయంలో గర్భం దాల్చితే ఆషాడ మాసంలో ఉన్న వాతావరణ పరిస్థితుల దృష్ట్యా పుట్టబోయే బిడ్డ ఆరోగ్యానికి మంచిది కాదట. ఈ కారణంతోనే ఆషాడమాసంలో భార్యాభర్తలు దూరంగా ఉండాలని పెద్దలు ఆచారం పెట్టారట.
అంతేకాకుండా కొత్తగా పెళ్లయిన అమ్మాయి పుట్టింట్లో అప్పుడు ఉండటమే శ్రేయస్కమని పెద్దలు భావించారు. ఆ సమయంలో గర్భం దాల్చితే తొమ్మిది నెలలు పూర్తయ్యేప్పటికీ చైత్రమాసం వస్తుంది. చైత్రమాసంలో కాన్పు అవ్వాలంటే అధిక వేడి దృష్ట్యా ఆ గర్భిణీ స్త్రీకి అలాగే పుట్టబోయే బిడ్డకు మంచిది కాదట. ఆషాడమాసం తర్వాత శ్రావణమాసం వస్తుంది. శ్రావణమాసంలో యజ్ఞ యాగాదులు నిర్వహిస్తారు. అందుకే శ్రావణమాసంలో కొత్తగా పెళ్లయిన అమ్మాయి గర్భం దాల్చితే తల్లికి అలాగే పుట్టబోయే బిడ్డకి మంచిదని శ్రావణమాసంలో అమ్మాయిని పుట్టింటి నుంచి అత్తింటికి తీసుకొస్తారు.
రిలీజ్ కానీ సౌందర్య సినిమా! ఇప్పటికీ రామోజీ ఫిలిం సిటీ ల్యాబ్ లో కాపీ