నిండునూరేళ్ళ జీవితానికి ఏడురోజుల్లోనే ముగింపు పలకాలని చూసింది ఓ ఇల్లాలు. కర్నూల్ జిల్లా మదనంతపురం కు చెందిన యువతిని, తుగ్గలి మండలం జొన్నగిరి చెందిన లింగమయ్య వివాహం చేసుకున్నాడు. పెళ్ళయిన వారం రోజులకే పాలల్లో విషం ఇచ్చి చంపాలని ప్రయత్నించింది ఆ యువతి. అపస్మారక స్థితిలో ఉన్న లింగమయ్యను గుత్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించాడు. సమయానికి ఆసుపత్రికి చేరుకోవటంతో ప్రాణాపాయం తప్పింది.
వివాహానికి ముందు యువతి ఇంకొకరిని ప్రేమించటమే దీనికి కారణమంటూ బంధువులు ఆరోపిస్తున్నారు. గత రాత్రి లింగమయ్యతో గొడవపడినట్టు కూడా సమాచారం