ఇప్పటి వరకు లవర్స్‌గా ఉన్న లేడీ సూపర్ స్టార్ నయనతార- డైరెక్టర్ విఘ్నేశ్ శివన్ త్వరలో దంపతులుగా మారబోతున్నారు. ఇందుకు సంబంధించిన వార్తలు ఇప్పటికే చాలా వచ్చాయి. కాగా, ఈ సారి వీరు తప్పకుండా వివాహ బంధంలోకి అడుగు పెట్టబోతున్నారని తెలుస్తోంది.
తిరుమల సన్నిధిలో వీరి వివాహం వచ్చే నెల 9న జరగనుందని వార్తలొచ్చాయి. కానీ, అందులో నిజం లేదని సమాచారం. తాజాగా వేదికలో మార్పు జరిగిందని, ఆ వేదికకు సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది.
వేదిక కోసం ముందస్తుగా పనులు ప్రారంభమయ్యాయని తెలుస్తోంది. సదరు వైరల్ వీడియో ప్రకారం..నయనతార-విఘ్నేశ్ శివన్ ల మ్యారేజ్ జూన్ 9న మహాబలిపురంలోని మహబ్ హోటల్‌లో జరగనుంది. వీడియోలో అందరినీ ఆహ్వానిస్తున్నట్లు పేర్కొనడం విశేషం.
అలా ఏడేళ్ల నుంచి ప్రేమికులుగా ఉన్న వారు పెళ్లి బంధంతో దంపతులుగా మారనున్నారు. ఇక వీరి ఎంగేజ్ మెంట్ కరోనా కట్టడికి విధించిన లాక్ డౌన్ టైంలో జరిగిన సంగతి తెలిసిందే. నిశ్చితార్థం జరిగిన విషయాన్ని నయనతారనే ఓ ఇంటర్వ్యూలో తెలిపింది.