స్టార్ హీరోయిన్ కాజల్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనవసరం లేదు. ఎన్నో సూపర్ డూపర్ హిట్ చిత్రాల్లో నటించింది. అలాగే అగ్ర హీరోలందరి సరసన కూడా నటించింది. కాగా గతేడాది కాజల్ వివాహం చేసుకుంది. తన స్నేహితుడైన గౌతమ్ ను వివాహం చేసుకుంది. ఇక హనీమూన్ కి వెళ్లి వచ్చినప్పటి నుంచి కూడా సినిమా షూటింగ్ లతో బిజీబిజీగా గడుపుతోంది.
కాగా కాజల్ కి సంబంధించి ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అది ఏంటంటే కాజల్ గర్భం దాల్చిందట. బాలీవుడ్ మీడియాలో ఇదే విషయంమై వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. కాజల్ కూడా గడిచిన రెండు వారాలుగా సోషల్ మీడియా లో కనిపించడం లేదు. ట్విట్టర్, ఫేస్ బుక్, ఇంస్టాగ్రామ్ అన్నింటిలో కూడా సైలెంట్ గా ఉంది. అయితే ఇందులో ఎంత వరకు నిజం ఉందో తెలియాలంటే కాజల్ స్పందించాల్సిందే.