టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి అల్లు రామలింగయ్య కూతురు సురేఖను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే చిరంజీవికి అంతటి క్రేజ్ రావడానికి కొంతలో కొంత అల్లు రామలింగయ్య కూడా కారణం అని చెబుతూ ఉంటారు కొంతమంది చెబుతూ ఉంటారు. ఇక చిరంజీవి కెరీర్ ప్రారంభంలో రామలింగయ్య ఆ టాలెంట్ ను గుర్తించి ప్రోత్సహించి తన కూతుర్ని ఇచ్చి పెళ్లి చేశారు. ఆ తరువాత అల్లు రామలింగయ్య పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా టాలీవుడ్ ని ఏలేసారు చిరు.
నిజానికి సురేఖతో పెళ్లికాకముందు చిరంజీవి కి అంత క్రేజ్ లేదు. అల్లు రామలింగయ్య మాత్రం స్టార్ కమెడియన్. సినిమాలను కూడా సొంతంగా నిర్మిస్తున్నాడు. అలాంటి సమయంలో సురేఖ ను ఇచ్చి పెళ్లి చేశారు అల్లు రామలింగయ్య.
పెళ్లి హక్కుల అమ్మకం… నయనతార పై దర్శకుడు సంచలన వ్యాఖ్యలు
అంతే కాదు ఈ వివాహంను ఆయన సన్నిహితుడు ప్రముఖ నటుడు ప్రభాకర్ రెడ్డి సలహాతో చేశారట. ఈ విషయాన్ని ప్రభాకర్ రెడ్డి భార్య సంయుక్త స్వయంగా చెప్పారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె అల్లు రామలింగయ్య కుటుంబం తో ఉన్న అనుబంధం గురించి తెలిపింది. చిరంజీవి సురేఖ పెళ్లి గురించి మాట్లాడుతూ… సురేఖకు కలెక్టర్ సంబంధం వచ్చిందని మరోవైపు చిరంజీవి కూడా పెళ్లి చేసుకుంటానని అన్నాడని అయితే అప్పుడు ఏం చేద్దాం అంటావు అంటూ మా ఆయనని అల్లురామలింగయ్య గారు అడిగారని తెలిపింది సంయుక్త.
చిరు సినిమాలో నటించిన చైల్డ్ ఆర్టిస్ట్ మాస్టర్ అర్జున్ ఎలా ఉన్నాడో తెలుసా?
అప్పుడు ఆయన పిల్లలకు అన్ని మనం ఇస్తాం. ఇప్పుడు కలెక్టర్ సంబంధం కూడా మంచిదే. కాకపోతే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవలసిన విషయం ఏంటంటే అమ్మాయికి ఎవరు నచ్చితే వాళ్ళని ఇచ్చి పెళ్లి చేయాలి అని అన్నారట. అప్పుడు చిరంజీవిని పెళ్లి చేసుకుంటానని సురేఖ చెప్పడంతో అలా ఈ ఇద్దరు పెళ్లి జరిగిందని తెలిపారు సంయుక్త.