యావత్ ప్రపంచానికి ఒమిక్రాన్ వేరియంట్ వణుకు పుట్టించింది. ఇప్పుడిప్పుడే ప్రపంచ దేశాలు ఒమిక్రాన్ భయం నుంచి భయపడుతున్నాయి. ఇలాంటి నేపథ్యంలో శాస్త్రవేత్తలు మరో షాకింగ్ న్యూస్ చెప్పారు. త్వరలో మరో వేరియంట్ రాబోతోందని, అది ఒమిక్రాన్ వేరియంట్ కన్నా చాలా రెట్లు ప్రమాదకరమని చెబుతున్నారు.
కొత్త వేరియంట్ గురించి ఎడిన్ బర్గ్ వర్సిటీ ప్రొఫెసర్ మార్క్ వూల్ హౌస్ మాట్లాడుతూ.. త్వరలో మరో కొవిడ్ వేరియంట్ వచ్చే అవకాశం ఉందన్నారు. అయితే అది వైరస్ కుటుంబంలో ఎక్కడ నుంచి వస్తుందనే అంశంపై ఇప్పటి వరకు స్పష్టత లేదన్నారు.
ఒమిక్రాన్ అనేది డెల్టా వేరియంట్ నుంచి వచ్చిందని చాలా మంది అనుకుంటారని, కానీ అది వైరస్ వంశ వృక్షంలో పూర్తిగా భిన్నమైన భాగం నుండి వచ్చిందన్నారు. అందువల్ల కొత్త వేరియంట్ అనేది వైరస్ వంశం వృక్షంలో ఏ భాగం నుంచి రాబోతోందో ఇప్పుడే మనకు తెలియదని చెప్పారు. అయితే అది ఎంత తీవ్రంగా ఉంటుందో మనం ఇప్పుడే అంచనా వేయలేమని పేర్కొన్నారు. బహుశా తదుపరి వేరియంట్ తీవ్రత ఎక్కువగా ఉండవచ్చునని లేదా అనుకున్నంత స్థాయిలో ఉండకపోవచ్చునని తెలిపారు.
వార్విక్ వర్సిటీకి చెందిన ప్రొఫెసర్ లారెన్స్ యంగ్ మాట్లాడుతూ.. ఆల్ఫా నుంచి బీటా, బీటా నుంచి గామా వరకు వైరస్ పరిణామ క్రమం ఒకే వరుసలో ఉందని చాలా మంది అనుకుంటారు. కానీ అది నిజం కాదు. వైరస్ తీవ్రత తగ్గిపోతోందనే అనే వాదన తప్పు. ఇప్పుడు రాబోయే వేరియంట్ డెల్టా వేరియంట్ కన్నా మరింత ప్రమాదకరంగా ఉంటుంది” అని తెలిపారు.