తెలంగాణా రాష్ట్రంలోరాగల మూడు రోజుల వర్షాలు పడనున్నాయి. గురువారం దక్షిణ ఇంటీరియర్ కర్ణాటక నుండి దక్షిణ ఛత్తీస్ ఘడ్ వరకు ఉన్న ఉపరితల ద్రోణి శుక్రవారం ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక నుండి ఉత్తర ఇంటీరియర్ ఒడిస్సా వరకు సగటు సముద్ర మట్టం నుండి 0.9 కి. మీ ఎత్తు వద్ద కొనసాగుతోంది.
దీనితో శుక్రవారం తెలంగాణా రాష్ట్రంలో తేలిక పాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే శనివారం కొన్ని చోట్ల, ఆదివారం అక్కడక్కడా వర్షాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మరి కొన్ని జిల్లాలలో రాగల మూడు రోజులలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షములు పడనున్నాయి. ఈ మేరకు హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.