బంగాళాఖాతంలో అల్పపీడనం క్రమంగా బలపడి వాయుగుండంగా మారింది. ఇది తుపానుగా మారనుందని వాతావరణశాఖ తెలిపింది. ఏపీలోని విశాఖ, ఒడిశాలోని గోపాలపూర్ మధ్య ఆదివారం తుపాను తీరం దాటుతుందని అంచనా వేసింది.
తుపాను ప్రభావంతో కోస్తాంధ్రలో రెండురోజులపాటు వర్షాలు పడతాయని అధికారులు తెలిపారు. ముఖ్యంగా ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు ఉంటాయని చెప్పారు. కొన్నిచోట్ల అతి భారీ వర్షాలు కూడా నమోదవ్వొచ్చని… తుపాను ప్రభావం తెలంగాణ, ఛత్తీస్ గఢ్ పైనా ఉంటుందని వివరించారు. సోమవారం తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్ గఢ్ లో అత్యంత భారీ వర్షాలు ఉంటాయని హెచ్చరించారు. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని సూచించారు అధికారులు.