2016లో బీహార్ ను మద్యపాన నిషేధం అమలు చేస్తున్న రాష్ట్రంగా సీఎం నితీష్ కుమార్ ప్రకటించారు. డ్రై స్టేట్ అంటూ హాడావిడి చేయగా… తాజాగా కేంద్ర ప్రభుత్వ సంస్థ చేసిన అధ్యయనంలో ఎలాంటి మద్యపాన నిషేధం లేని మహారాష్ట్ర కన్నా ఎక్కువగా బీహార్ లో మద్యం అమ్మకం సాగుతున్నట్లు తేలింది.
అవును… జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే 2019-20 లెక్కల ప్రకారం బీహర్ లో 15 ఏళ్లు దాటిన పురుషుల్లో 15.5శాతం వారు మద్యం సేవించే వారేనని తెలిపింది. పట్టణ ప్రాంతాలతో పోల్చితే బీహర్ గ్రామీణ ప్రాంతంలోనే ఎక్కువ మద్యం సేవిస్తున్నారని, మొత్తం బీహార్ లో 15.8శాతం మద్యం ప్రియులున్నట్లు లెక్కకట్టింది. అదే సమయంలో మద్యపాన నిషేధం లేని మహారాష్ట్రలో ఆ సంఖ్య 13.9శాతంగా ఉంది. మహారాష్ట్రలో కూడా గ్రామీణ ప్రాంతంలో 14.7శాతం మద్యం ప్రియులుండగా… పట్టణ ప్రాంతాల్లో 13శాతం మంది మద్యం సేవిస్తున్నట్లు తెలిపింది.
ఇక తెలంగాణలో ఏకంగా 36.9శాతం మందికి మద్యం అలవాటుండగా…. ఫారెన్ కల్చర్ కు దగ్గరగా ఉండే గోవాలో అత్యధికంగా 43.3శాతం మంది మద్యం సేవిస్తున్నారు. దేశంలోని అన్ని రాష్ట్రాలతో పోల్చితే గుజరాత్, జమ్మూ-కాశ్మీర్ రాష్ట్రాల్లో మద్యం అతి తక్కువగా వాడుతారని సర్వే తేల్చింది.
ఇక పోగాకు వాడకంలో మిజోరం రాష్ట్రం టాప్ ప్లేసులో ఉండగా… ఆ రాష్ట్రంలోని మొత్తం పురుషుల్లో 75శాతం మంది, మహిళల్లో 65శాతం మంది పోగాకు వాడుతున్నారు.