ఉద్యోగుల పీఆర్సీ పై సీఎం హామీ ఇవ్వడం సంతోషంగా ఉందని ఏపీ ఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు బండి శ్రీనివాస్ అన్నారు. జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశంలో పీఆర్సీ నివేదిక ఇవ్వలేదని చెప్పారు. ఆ నివేదిక ఎందుకు దాస్తున్నారో అర్థం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
జీతాలు సక్రమంగా రావడం లేదన్న శ్రీనివాస్… పెన్షన్లు కూడా రెండు నెలలు పడుతోందని అన్నారు. జీపీఎఫ్, ఏపీ జీఎల్‌ఏ బిల్లులకు సంబందించి 1600కోట్ల వరకు పెండింగులో ఉన్నాయని చెప్పారు. 13 లక్షల మంది ఉద్యోగులు, పెన్షనర్ల సమస్యలకు సంబంధించి ఉన్న 71 డిమాండ్లకు గానూ అనేక సార్లు చీఫ్ సెక్రటరీని కలిశామన్నారు. వాటిలో ఒక్కదాన్నే ప్రకటించడం బాధాకరమని.. 22 సంవత్సరాలుగా పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులను తక్షణమే పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు.