ఈరోజు జరిగిన రెవిన్యూ ఉద్యోగుల ధర్నాలో కనపడని టిఎన్ జిఓ నాయకులు. కారణం ముఖ్యమంత్రితో లోపాయికారి ఒప్పందమే అంటున్నారు ఉద్యోగులు. విభజించి పాలిస్తున్న ప్రభుత్వం అని ఇతర సంఘాలు మండిపడుతున్నాయి. జిల్లాల నుండి మొదలుపెట్టి రాష్ట్ర నాయకుల వరకు ఆర్ధిక రాజకీయ పరమైన అంశాలే అని ఉద్యోగుల అభిప్రాయం. ఎక్కడ హోసింగ్ సొసైటీ అక్రమాలు అక్రమ ఆస్తులు బయటికి వస్తాయో అనే భయంతోనే అటు ఆర్ టి సి సమ్మెకు కానీ నేడు రాష్ట్రవ్యాప్తంగా జరిగిన రెవెన్యూ ఉద్యోగుల నిరసనలలో కనపడటం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. టి ఎన్ జి ఓ నాయకులు ఇలా ఉంటె మన సమస్యలు ఎలా పరిష్కారమవుతాయి? ఉద్యోగులరా మేలుకోండి ద్వంద వైఖరి అవలంభిస్తున్న ఉద్యోగ సంఘ నాయకులను నిలదీయండి.స్వలాభం కోసం ఉద్యోగుల హక్కులను తాకట్టు పెట్టిన నాయకులను తరిమి తరిమి కొట్టండి. ఈ (నపుంసక )నాయకుల మాటలు వినకండి.మన హక్కైలకై పోరాడే సమయమిదే.ఆర్ టి సి ఉద్యోగుల తెగువ చూసైనా ముందుకు రండి. ఇప్పటికైనా అటు ఆర్ టి సీ ఉద్యోగుల సమ్మెకు ఇటు రెవెన్యూ ఉద్యోగుల నిరసనలకు మద్దతు ఇవ్వండి లేకపోతె భవిష్యత్తు లొవారి స్థానంలో మనం ఉండొచ్చు. సకల జనుల సమ్మెతో సాధించుకున్న తెలంగాణ అస్థిత్వం కాపాడుకునే సమయం ఆసన్నమైంది. మరో సకలజనుల సమ్మె చేపట్టే సమయం ఇదే. చేయి చేయి కలపండి మన హక్కులకై పోరాడాల్సిన తరుణం ఇది. ఉద్యోగుల ఐక్యత వర్ధిల్లాలి.జై తెలంగాణ అంటూ ఉద్యమకారులు, ఇతర ఉద్యోగ సంఘాలు, ఉద్యోగస్థులు పిలుపునిస్తున్నారు.