అడవులను కాపాడే అధికారులను కొట్టి, బెదిరించిన నాయకుడి అన్నగా… అబద్ధపు సాక్షం చెప్పాలంటూ బెదిరించిన ఎమ్మెల్యే కోనేరు కొనప్ప అడవులు, వన్యప్రాణి సంరక్షణకు ఎలా కట్టుబడి ఉంటారని ప్రశ్నిస్తున్నాయి ఎన్జీవో సంఘాలు. ఎమ్మెల్యే కోనప్పను రాష్ట్ర అటవీ వన్యప్రాణి సంరక్షణ బోర్డు మెంబర్‌గా నియమించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం కావాలనే ఇలాంటి వారిని ప్రోత్సహిస్తుందా అంటూ మండిపడుతున్నారు ఎన్జీవో నేతలు.
ఇలాంటి బోర్డు ఎక్కడా చూడలేదని, ఎంతో కీలకమైన నల్లమల నుండి ఇద్దరు ఎస్టీలను బోర్డుకు నామినెట్ చేయాల్సి ఉన్నా చేయలేదని… గోండుల నుండి ఒకరిని తీసుకున్న ప్రభుత్వం చెంచుల నుండి ఒక్కరికీ అవకాశం ఇవ్వకపోవటం దారుణమని అటవీ వన్యప్రాణి రక్షణ సొసైటీ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఎమ్మెల్యే కోనేరు కోనప్పలాంటి నేతలను ఎలా అంగీకరిస్తామని… ఆయన ఫారెస్ట్ అధికారుల కేసుల విషయంలో స్థానిక జనాన్ని ఎలా బెదిరించారో వీడియోలు కూడా వచ్చాయని గుర్తు చేస్తున్నారు.