ఏపీ ప్రభుత్వం తలపెట్టిన రాయలసీమ ఎత్తిపోతల పథకంపై చెన్నై ఎన్జీటీలో విచారణ జరిగింది. ఎలాంటి అనుమతులు లేకుండా ఏపీ సర్కార్ 40వేల క్యూసెక్కుల సామర్థ్యం ఉన్న కాలువులను 80వేలకు పెంచుతుందని తెలంగాణకు చెందిన గవినోళ్ల శ్రీనివాస్ ఎన్జీటీని ఆశ్రయించారు.
ఇది కొత్త ప్రాజెక్టు కాదని, మాకు రావాల్సిన నీటినే వాడుకుంటున్నట్లు ఏపీ వాదించగా… ప్రాజెక్టును వ్యతిరేకిస్తున్నట్లు తెలంగాణ అఫిడవిట్ దాఖలు చేసింది. అయితే ఈ విషయంలో కేంద్రం వైఖరి చెప్పాలంటూ ఎన్జీటీ కేంద్రానికి వారం రోజుల గడువు ఇచ్చింది. అదే రోజు తుది తీర్పు వెలువడే అవకాశం ఉంది.