కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో కోర్టు ధిక్కారణ పిటిషన్‌పై ఎన్జీటీలో విచారణ జరిగింది. సరైన అనుమతులు లేకుండా ప్రాజెక్టు విస్తరణ పనులు చేపట్టవద్దని గతంలో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలిచ్చినా… ప్రభుత్వం విస్తరణ పనులు చేస్తుందని తుమ్మలపల్లి శ్రీనివాస్ కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేశారు.
కాళేశ్వరం ప్రాజెక్టు అక్రమంగా నిర్మించారని… విస్తరణ పనులకైనా సరైన అనుమతులు తీసుకుని పనులు చేపట్టాలంటూ గతంలో ఎన్టీజీ ఆదేశాలు జారీ చేసింది. దానికి సంబంధించి జలశక్తి, పర్యావరణ శాఖ, సీడబ్ల్యూసీలకు కూడా ఆదేశాలు జారీ చేసింది. ఆ ఆదేశాలను ప్రభుత్వం ఖాతరు చేయకుండా కాళేశ్వరంలో విస్తరణ పనులు వేగవంతం చేస్తోందని తుమ్మలపల్లి పిటిషన్ వేయటంతో ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను కేంద్ర జలశక్తి, పర్యావరణ శాఖ, సీడబ్ల్యూసీలకు తెలియజేయాలని, వాళ్లు చర్యలు తీసుకోకపోతే మళ్లీ ఎన్జీటికి రావాలని, లేదంటే సుప్రీం కోర్టులోనైనా పిటిషన్ వేయవచ్చునని తుమ్మలపల్లికి ఎన్జీటీ సూచించింది.