రాయలసీమ ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మిస్తున్న సంగమేశ్వర ప్రాజెక్టుపై ఎన్జీటీలో విచారణ జరిగింది. ఈ అంశంలో దాఖలైన కోర్టు ధిక్కరణ పిటిషన్‌ను విచారించిన ఎన్జీటీ చెన్నై బెంచ్, ప్రాజెక్టు నిర్మాణ పనులు చేపట్టొద్దని పునరుద్ఘాటించింది. ఈ పిటిషన్ ను తెలంగాణ వాసి గవినోళ్ల శ్రీనివాస్ దాఖలు చేశారు.
పర్యావరణ అనుమతులు లేకుండా ప్రాజెక్టు చేపట్టారని పిటిషనర్ వాదించగా… అనుమతులు లేకుండా ముందుకెళ్లొద్దని ఎన్జీటీ ఆదేశించింది. ఈ అంశంపై సమాధానం ఇవ్వాలని కృష్ణా నదీ యాజమాన్య బోర్డును ఎన్జీటీ ఆదేశించింది. ఏపీ పనులు నిలుపుదల చేయలేదన్న తెలంగాణ అభ్యంతరాలపై నిజనిర్ధారణ కమిటీతో పనులు పర్యవేక్షించాలని కృష్ణా నదీ యాజమాన్య బోర్డును ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 24కి వాయిదా వేసింది.