కొత్త సాగు చట్టాల రద్దు కోసం రైతులు చేసిన ధర్నా కారణంగా భారీగా నష్టాలు వచ్చాయని ఎన్ హెచ్ఏఐ ప్రకటన చేసింది. గతేడాది అక్టోబర్ లో రైతు ఆందోళనలు మొదలయ్యాయి. దీంతో టోల్ ఛార్జీలు వసూలు కాలేదని చెప్తోంది. పంజాబ్, హర్యానా, రాజస్థాన్ లో రైతులు హైవేలపై రాస్తారోకోలు చేశారు. దీంతో వాహనదారులు టోల్ గేట్ వైపుకు రాకుండా రాకపోకలను దారి మల్లించడంతో… దాదాపు రూ.2,731 కోట్ల టోల్ ఛార్జీలు వసూలు కాలేదంటూ రాజ్యసభలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటన చేశారు. 2021 ఆర్థిక సంవత్సరంలో మరో 12 వేల కిలో మీటర్ల జాతీయ రహదారి నిర్మాణం దిశగా పని చేస్తున్నామని గడ్కరీ పేర్కొన్నారు.
Tolivelugu Latest Telugu Breaking News » Scrolling » నేషనల్ హైవేకు భారీ నష్టం.. కారణం ఏంటి..?