దిశ హత్య కేసు నిందితులను ఎన్కౌంటర్ చెయ్యటం దేశవ్యాప్తంగా హర్షం వ్యక్తం అవుతుంటే మరో వైపు ఎన్కౌంటర్ ను తప్పుబడుతూ మహిళా సంఘాలు హైకోర్టు ని ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఎన్కౌంటర్ పై విచారణ జరిపేందుకు హైదరాబాద్ చేరుకున్న జాతీయ మానవహక్కుల సంఘం బృందం ఎన్కౌంటర్ జరిగిన ప్రదేశాన్ని పరిచీలించి ఎక్కడ నుంచి మహబూబ్ నగర్ కు చేరుకున్నారు. మహబూబ్ నగర్ ప్రభుత్వాసుపత్రిలో మృతదేహాలను పరిశీలించి అక్కడ నుంచి నిందితుల స్వగ్రామం కు వెళ్లనున్నారు. ప్రస్తుతం నిపుణుల కోసం ఎదురుచూస్తున్న మానవహక్కుల సంఘం బృందం సూపరింటెండెంట్ చాంబర్ లో వేచి ఉన్నారు. మరికాసేపట్లో ఫోరెన్సిక్ నిపుణులతో కలిసి లోపలి వెళ్లనున్నారు.