పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా(పీఎఫ్ఐ)పై జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ దాడులు కొనసాగుతున్నాయి. రాజస్థాన్‌లో రాష్ట్ర పోలీసులతో కలిసి ఎన్ఐఏ దాడులు చేసింది. పీఎఫ్ఐతో సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణల మేరకు రాజస్థాన్ కు చెందిన ఓ వ్యక్తిని ఎన్ఐఏ అధికారులు అరెస్టు చేశారు.
అనుమానితున్ని మహమ్మద్ సోహెల్ గా ఎన్ఐఏ గుర్తించింది. రాష్ట్రంలో పీఎఫ్ఐతో కలిసి శాంతికి భంగం కలిగించి హింసాత్మక ఘటనలకు సోహెల్ కుట్రలు పన్నారని ఎన్ఐఏ పేర్కొంది. రాష్ట్రంలో ఓ వర్గానికి చెందిన యువతను తీవ్రవాదం వైపు మళ్లించేందుకు ప్రయత్నించాడని ఎన్ఐఏ తెలిపింది.
అంతకు ముందు కర్ణాటకలో ఎన్ఐఏ అధికారులు దాడులు చేశారు. ఉగ్ర సంస్థ అల్ ఖైదాతో సంబంధాలున్న ఆరోపణల మేరకు ఆరిఫ్ అనే వ్యక్తిని ఎన్ఐఏ అరెస్టు చేసింది. అంతర్గత భద్రతా విభాగం (ఐఎస్‌డీ), జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) సంయుక్తంగా బెంగళూరులో ఆపరేషన్ నిర్వహించి ఆరిఫ్‌ను అదుపులోకి తీసుకుంది.
ఆరిఫ్ ప్రస్తుతతం సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ గా పని చేస్తున్నాడు. యూపీకి చెందిన ఆరిఫ్‌కు వివాహమై పిల్లలు కూడా ఉన్నారు. అతను ప్రస్తుతం రాజధాని బెంగళూరులోని తానిసంద్రలో ఉంటున్నాడు. ప్రస్తుతం వర్క్ ఫ్రమ్ హోమ్ ద్వారా చేస్తున్నాడు.