ఆంధ్రప్రదేశ్‌లో ఎన్ ఐ ఏ సోదాలు కలకలం సృష్టించాయి. ఏకకాలంలో ప్రకాశం, విజయవాడ,నెల్లూరులో ఎన్ ఐఏ తనిఖీలు చేపట్టింది.మావోయిస్టులకు నిధులు అందిస్తున్నారనే ఆరోపణలు రావడంతో ఎన్ ఐ ఏ అధికారులు ఏకకాలంలో నాలుగు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు.
ప్రకాశం జిల్లాతో పాటు నెల్లూరు విజయవాడలోని రెండు ప్రాంతాల్లో సోదాలు చేపట్టారు. మావోయిస్టు అగ్రనేత ఆర్కే భార్య శిరీష, విరసం నేత కల్యాణ్ రావు ఇళ్ల ల్లో తనిఖీలు చేపట్టారు. శిరీష ఇంట్లో లేకపోవడంతో తాళం పగలగొట్టి మరీ సోదాలు చేపట్టడంపై ప్రజా సంఘాలు మండిపడుతున్నాయి.
విజయవాడలోనూ ఎన్ ఐ ఏ సోదాలు చేసింది. సింగ్ నగర్‌లో విరసం నేత దొడ్డి ప్రభాకర్ నివాసంలో తనిఖీలు చేశారు. ఎన్ ఐ ఏ అధికారులు . మావోయిస్టులకు నిధులు అందిస్తున్నారనే ఆరోపణలతో ఈ సోదాలు చేపట్టినట్లు తెలుస్తోంది.
ప్రకాశం టంగుటూరు ఆలకూరపాడులో ఎన్ ఐ ఏ సోదాలు చేస్తోంది. ఆలకూరపాడు, విజయవాడ, నెల్లూరులో ఏకకాలంలో సోదాలు జరిగాయి. ఆర్కే భార్య శిరీష ఇంట్లో లేకపోవడంతో తహశీల్దార్ సమక్షంలో ఇంటి తాళాలు పగలకొట్టి సోదాలు నిర్వహిస్తున్నారు.
ఉదయం నుంచి తనిఖీలు కొనసాగుతున్ఆనయి. విరసం నేతలపై కొద్ది రోజుల క్రితం విశాఖ జిల్లా పెద్దబాయలు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది.దీంతో చత్తీస్‌గడ్‌కు చెందిన ఎన్ ఐఏ అధికారుల బృందం విజయవాడకు చేరుకుని సింగ్‌నగర్ లో విరసం నేత దొడ్డి ప్రభాకర్ ఇంట్లో కూడా సోదాలు చేసింది.