హైదరాబాద్ పాతబస్తీలో ఎన్ఐఏ సోదాలు జరిపింది. ఉదయ్ పూర్ లో టైలర్ కన్హయ్య హత్య కేసుకు సంబంధించి కేంద్ర దర్యాప్తు సంస్థ సోదాలు చేసింది.
ఈ కేసులో ఓ నిందితుని పోలీసులు అరెస్టు చేశారు. విచారణ సమయంలో ఆ నిందితుడి ఫోన్ లో బీహార్ వాసి మహమ్మద్ మొనవౌర్ ఫోన్ నంబర్ ను ఎన్ఐఏ అధికారులు గుర్తించారు.
ప్రస్తుతం అతను హైదరాబాద్ పాతబస్తిలో ఉంటున్నట్టు పోలీసులు గుర్తించారు. నిందితుడి ఫోన్ లో మొనవౌర్ నంబర్ ఉండటంతో పాతబస్తిలో ఎన్ఐఏ అధికారులు తనిఖీలు చేపట్టారు.
అతన్ని ఎన్ఐఏ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం మాదాపూర్ ఎన్ఐఏ కార్యాలయానికి అతన్ని అధికారులు తరలించారు.
బిహార్‌కి చెందిన మహమ్మద్ మొనవౌర్ హుస్సేన్ ఓ మదర్సా నడుపుతున్నట్టు స్థానికులు చెబుతున్నారు. ఈ సోదాలపై ఎన్ఐఏ నేడు అధికారికంగా ప్రకటన చేసే అవకాశం ఉంది.