హీరోయిన్ నిధి అగర్వాల్ గురించి కొత్తగా పరిచయం చేయనవసరం లేదు. తన అందంతో అభినయంతో వరుస సినిమాలను చేస్తోంది నిధి అగర్వాల్. గతంలో సవ్యసాచి, మిస్టర్ మజ్ను, ఇస్మార్ట్ శంకర్ వంటి సినిమాల్లో నటించింది. ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న హరి హర వీరమల్లు సినిమాలో కూడా నటిస్తోంది. అలాగే అశోక్ గల్లా హీరో సినిమాలో కూడా నటిస్తోంది. తాజాగా నితిన్ సినిమాలో అవకాశం దక్కించుకుంది.
నితిన్ హీరోగా ప్రస్తుతం మాచర్ల నియోజకవర్గం సినిమా తెరకెక్కుతుంది. శేఖర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ఒక కథానాయికగా కృతి శెట్టిని తీసుకున్నారు. మరో హీరోయిన్ గా నిధి అగర్వాల్‌ను ఎంపిక చేసినట్టుగా సమాచారం.