పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం హరి హరి వీరమల్లు. ఏ ఏం రత్నం నిర్మిస్తున్న ఈ సినిమా పీరియాడికల్ డ్రామా గా తెరకెక్కుతుంది. ఇక ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన లుక్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇక సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న నిధి అగర్వాల్ ఈ సినిమాకు సంబంధించి ఓ అప్డేట్ ను ఇచ్చింది.
టీజర్ చూస్తే ఇది పూర్తి స్థాయి పీరియడ్ లాగా కనిపించిందని కానీ ఈ సినిమాలో మరో కోణం ఉందని నిధి తెలిపింది. హరిహర వీరమల్లు కథ రెండు వేర్వేరు కాలాల్లో నడుస్తుందని ప్రధానంగా దశాబ్దాల కిందటి నేపథ్యంలో కథ నడుస్తుందని.. అలాగే వర్తమానంలోనూ కొంత కథ నడుస్తుందని తెలిపింది.
నిజానికి ఎప్పుడో రిలీజ్ కావాల్సిన ఈ చిత్రం వివిధ కారణాలతో వాయిదా పడుతూ వచ్చింది. ప్రస్తుతానికి సగ భాగం షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమాకు ఎం ఎం కీరవాణి ఈ సినిమా సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే.