దిశ హత్య ఘటన తరువాత సోషల్ మీడియాలో అత్యాచారాలు, హత్యలపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. అయితే ఒక నెటిజన్ చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. సమాజంలో అత్యాచారాలు, హత్యలు జరగటానికి కారణం ఒక నటి అని, ఆమె ఎవరో కాదు నిధి అగర్వాల్ అంటూ చెప్పుకొచ్చాడు.
పూరిజగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమాలో నిధి అగర్వాల్ రెచ్చిపోయి అందాలను చూపించిందని, నిధి అలా చెయ్యటం వల్లే మహిళలపై అత్యాచారాలు, హత్యలు జరుగుతున్నాయంటూ కామెంట్ చేశాడు.
దీనిపై స్పందించిన నిధి అగర్వాల్ మీ పూర్తి చిరునామా తెలపాలని, మీకు పింక్ సినిమా పంపుతానని, మీలాంటి వారికి ఆ సినిమా అవసరమంటూ చెప్పుకొచ్చింది. సమాజంలో ఇలా కూడా ఆలోచించే వారు ఉన్నారా అంటూ ఆశ్చర్యపోయింది. నిధి ఇచ్చిన సమాధానానికి నెట్టింట్లో ప్రశంశలు వెల్లువెత్తుతున్నాయి.