మహేష్ మేనల్లుడి సరసన ఇస్మార్ట్ పోరి - Tolivelugu

మహేష్ మేనల్లుడి సరసన ఇస్మార్ట్ పోరి

మహేష్ బాబు మేనల్లుడు, గల్లా జయదేవ్ కుమారుడు అశోక్ గల్లా సినిమా 10 వ తారీఖున ప్రారంభంకానుంది. ఈ సినిమాకి మహేష్ బాబు సోదరి గల్లా జయదేవ్ సతీమణి పద్మావతి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వస్తున్న ఈ సినిమాలో హీరోయిన్ ఎవరన్న చర్చకు తెరపడింది. అశోక్ గల్లా సరసన ఇస్మార్ట్ పోరి నిధి అగర్వాల్ నటించనున్నారని చిత్ర యూనిట్ తెలిపింది.
పూరిజగన్నాథ్ దర్శకత్వంలో రామ్ సరసన నిధి నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో తన అందంతో ప్రేక్షకులను ఈ అమ్మడు ఆకట్టుకుంది. ఇస్మార్ట్ శంకర్ విజయంతో మంచి జోష్ మీద ఉంది.

Share on facebook
Share on twitter
Share on whatsapp