అక్కినేని నాగచైతన్య హీరోగా వచ్చిన సవ్యసాచి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్ గా పరిచయమైంది నిధి అగర్వాల్. ఈ సినిమా అనుకున్న స్థాయిలో విజయం సాధించలేకపోయింది. కానీ ఆ తర్వాత వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమా స్టార్ హీరోయిన్ అయిపోయింది. ప్రస్తుతం కోలీవుడ్ టాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తోంది. అలాగే పవన్ కళ్యాణ్ హీరోగా క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో కూడా ఛాన్స్ దక్కించుకుంది.
ఇదిలా ఉండగా ఫిబ్రవరి 14 ప్రేమికుల రోజు సందర్భంగా చెన్నైలో ఈ అమ్మడికి కొంతమంది అభిమానులు ఏకంగా గుడి కట్టారు. అంతేకాకుండా విగ్రహానికి పాలాభిషేకం చేశారు. ఈ విషయాన్ని నిధి ఫాన్స్ క్లబ్ పోస్ట్ చేసింది. అందుకు సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే హీరోయిన్ కు గుడి కట్టి పాలభిషేకం చేయడం అందరినీ షాక్ కి గురి చేస్తోంది. మరి ఈ విషయం నిధికి తెలుసో లేదో తెలియదు. ఒకవేళ తెలిస్తే దీనిపై ఎలాంటి రియాక్షన్ ఇస్తుందో చూడాలి.