పండగ కానుకగా హీరో అనే సినిమా రిలీజైంది. మహేష్ బాబు కుటుంబానికి చెందిన గల్లా అశోక్ ఈ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. అయితే ఇక్కడ మేటర్ అది కాదు. ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన నిధి అగర్వాల్ టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. అది పాజిటివ్ గా మాత్రం కాదు, పూర్తిగా నెగెటివ్ గా..!
అవును.. హీరో సినిమా చూసిన ప్రేక్షకులంతా అందులో నిధి అగర్వాల్ ను చూసి అవాక్కయ్యారు. ఆమె పూర్తిగా షేప్ అవుట్ అయింది. కుర్రాడు అశోక్ సన్నగా ఉండడం వల్ల ఆమె లావుగా కనిపించిందని ప్రారంభంలో అనుకున్నప్పటికీ.. సినిమా పూర్తయ్యేసరికి క్లియర్ పిక్చర్ వచ్చేసింది. ఎస్.. నిధి అగర్వాల్ తన నిధుల్ని బాగా పెంచేసింది. బొద్దుగా మారిపోయింది.
ఆమె స్టార్ హీరోయిన్ కాదు. ఇంకా చెప్పాలంటే ఆ రేసులోకి కూడా ఆమె ఇంకా ఎంట్రీ ఇవ్వలేదు. తిప్పికొడితే ఇస్మార్ట్ శంకర్ తప్ప ఆమె ఖాతాలో చెప్పుకోదగ్గ హిట్ లేదు. ఇలాంటి టైమ్ లో అందాన్ని కాపాడుకుంటూ, మంచి పాత్రలు సెలక్ట్ చేసుకుంటూ జాగ్రత్తగా కెరీర్ ను ప్లాన్ చేసుకోవాలి.
ఈరోజు రిలీజ్ అయిన హీరో అనే సినిమా చూస్తే నిధిలో అలాంటి ఆలోచనలు ఉన్నట్టు అనిపించట్లేదు. ఆమె కాస్త బొద్దుగా మారింది. ముఖం కూడా ఉబ్బినట్టు కనిపించింది. ఇలాంటి ఫిజిక్ తో ఆమె కుర్రహీరోల సరసన హీరోయిన్ గా సెట్ అవ్వదు. అంతేకాదు, ఈ ఏడాది ఆమె బాలీవుడ్ రీఎంట్రీ ఇస్తోంది. ఈ ఫిజిక్ తో బాలీవుడ్ లో నెగ్గుకురావడం అసంభవం.