తన అందచందాలతో తక్కువ సమయంలోనే కుర్రకారుకు దగ్గరైన అమ్మడు నిధి అగర్వాల్. పూరిజగన్నాథ్ దర్శకత్వంలో రామ్ హీరోగా వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమాతో ఈ అమ్మడు మంచి హిట్ కొట్టింది. అందాలు ఆరబోయటంలో ముందుండే నిధి ప్రస్తుతం వరుస అవకాశాలతో మంచి జోష్ మీద ఉంది. ప్రస్తుతం మహేష్ బాబు మేనల్లుడు, టీడీపీ ఎంపీ గల్లాజయదేవ్ కుమారుడు గల్లా అశోక్ సరసన ఈ అమ్మడు నటిస్తుంది.
హాట్ డ్రెస్‌లకు కేరాఫ్ అడ్రస్‌గా ఉండే ఈ భామ ఎప్పుడూ పొట్టి పొట్టి డ్రెస్ లు వేసుకుని తన సోషల్ మీడియా అకౌంట్లో ఫొటోస్ పోస్ట్ చేస్తూ ఉంటుంది. కానీ ఈ సారి డిఫరెంట్ గా చీర కట్టులో అందరినీ ఆశ్చపర్చినా… తన అందంతో తళుక్కున మెరిసింది. చీరకట్టులో నిధిని చూసిన ఫాన్స్ ఫిదా అవుతున్నారు.