సోషల్ మీడియా నిన్ను అమాంతం ఆకాశానికి ఎత్తేయగలదు..లేదంటే పాతాళానికి తొక్కేయగలదు..అవకాశాలు సృష్టించగలదు..ఉన్న అవకాశాలను పోగొట్టగలదు.. జీవితాల్ని నిలబెట్టగలదు..అనడానికి ఎన్నో ఉదాహరణలు,ఎన్నో ఘటనలు చూసాం..తాజాగా అటువంటిదే ఈ సంఘటన కూడా ఎక్కడ నైజిరియా..ఎక్కడ అమెరికా… నైజిరియాలోని మారుమూల ప్రాంతానికి చెందిన ఒక కుర్రాడికి అమెరికాలో ప్రఖ్యాత డ్యాన్స్ స్కూల్ నుండి పిలుపు రావడం..దానికి సోషల్ మీడియా వేదిక కావడం నిజంగా సూపర్ కదా..
నైజిరియాలోని లీప్ ఆఫ్ డ్యాన్స్ అకాడెమికి చెందిన స్టూడెంట్ 11ఏళ్ల ఆంథోని మెసోమా.. ఆ కుర్రాడు చేసిన డ్యాన్స్ వీడియో ఒకటి లాస్ట్ మంథ్ ఇన్స్టాలో పోస్ట్ చేసింది సదరు డ్యాన్స్ అకాడెమి.. వర్షంలో, అకాడెమి ముందు , కాళ్లకు ఏం లేకుండా,కాంక్రీట్ రోడ్ పై.. అద్భుతమైన బాలే డ్యాన్స్ ప్రదర్శన అది.. తన్మయత్వంతో డ్యాన్స్ లోనే మమేకమైతే తప్ప సాధ్యం కానిది..చాలా అవలీలగా చేసాడు ఆంథోని..
లక్షలమంది ఆ వీడియోను చూసారు.. షేర్ చేసారు.. ఆ వీడియో సోషల్ మీడియా మొత్తం వైరలయింది..అమెరికర్ ఎలైట్ బాలెట్ థియేటర్ వారి వరకు చేరింది.. ఆంథోని డ్యాన్స్ లోని స్పార్క్ ని గుర్తించి స్కాలర్షిఫ్ ఇవ్వడానికి ముందుకు రావడమే కాదు..ఆన్లైన్లో ట్రెయినింగ్ ఇవ్వడానికి ఇంటర్నెట్ యాక్సస్ కూడా కల్పించారు..
నిజానికి ఆంథోనిని చర్చ్ ఫాదర్ గా చూడాలన్నది తల్లిదండ్రుల కల..కానీ ప్రపంచం మెచ్చే డ్యాన్సర్ అవుతాడని వారు అస్సలు ఊహించి ఉండరు..లీప్ ఆప్ డ్యాన్స్ అకాడెమి పేరుతో ఇన్స్టిట్యూట్ పెట్టి డ్యాన్స్ అంటే ఇంట్రస్ట్ ఉన్న పిల్లలకు డేనియల్ అజాలా ఒసోని..నైజిరియా వాసులకు అస్సలు పరిచయం లేని డ్యాన్స్ బాలే.. “నా డ్యాన్స్ చూసి నా ఫ్రెండ్స్ ఫారిన్ డాన్స్ చేస్తున్నాను అనుకుంటారు అని అబ్బురంగా చెప్తుంటాడు ఆంథోని. ప్రస్తుతం వైరలవుతోన్న ఆంథోని వీడియో కేవలం తనకు మాత్రమే అవకాశాలు తెచ్చిపెట్టట్లేదు..అత్యంత దుర్బర పరిస్థితుల్లో ఉన్న లీప్ ఆఫ్ డ్యాన్స్ అకాడెమికి కూడా విరాళలలందించడానికి ఉపయోగపడుతుంది.. ఆల్ ది బెస్ట్ ఆంథోని..!
Watch Dance :